పురుషుల్లో స్పెర్మ్ కౌంట్(వీర్యవృద్ధి)కు సహజ మార్గాలు

No Comments
సంతానం లేకపోవడానికి స్పెర్మ్ కౌంట్ తక్కువగా వుండడం కూడా ఒక కారణం.మగవారిలో సంతాన సాఫల్యత కలగకపోయేందుకు పలు రకాల కారణాలు ఉండవచ్చు. వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉండేందుకు, వాటి మొబిలిటీ (చలనం) తక్కువగా ఉండేందుకు లేదా అండాన్ని ఫలదీకరించే శక్తి తక్కువగా ఉండేందుకు ఎన్నో రకాల కారణాలు ఉండవచ్చు. వీర్యం ఉత్పత్తిలో లేదా పనితీరులో చోటు చేసుకునే అసాధరణత్వాలు, సాధారణ ఆరోగ్యం, జీవనశైలి సంబంధిత అంశాలు, కొన్ని రకాల పరిస్థితులకు ఎక్కువగా లోను కావడం ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. చాలా వరకు సమస్యలు వీర్యానికి సంబంధించినవే అయి ఉంటాయి. స్పెర్మ్‌ కాన్‌సెంట్రేషన్‌ (వీర్యం సాంద్రత) తక్కువగా ఉండడం కూడా ఓ ముఖ్యమైన సమస్యనే. సాధారణంగా వీర్యసాంద్రత మిల్లీలీటర్‌ సెమెన్‌కు 20 మిలియన్ల స్పెర్మ్‌గా లేదా అంతకన్నా ఎక్కువగా ఉండాలి. 10 మిలియన్ల కౌంట్‌ లేదా అంతకన్నా తక్కువ కౌంట్‌ను స్పెర్మ్‌ కాన్‌సెంట్రేషన్‌ తక్కువగా ఉండడం (సబ్‌ఫెర్టిలిటీ)గా వ్యవహరిస్తారు. ఈ కౌంట్‌ 40 మిలియన్లకు మించడాన్ని అధిక సంతానసాఫల్యతగా గుర్తిస్తారు. వృషణాలు వీర్యాన్ని అసలుకే ఉత్పత్తి చేయకపోవడం అనేది అత్యంత అరుదు. మీ స్పెర్మ్ కౌంట్ పెంచుకోవడానికి వివిధ మార్గాలు ఇక్కడ వివరించాం, మీరు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి అలవాట్లు చేసుకోవాలి లాంటివి. ఇవి మీ స్పెర్మ్ కౌంట్ సహజంగా పెంచే మార్గాలు, తద్వారా మీ సంతానోత్పత్తి అవకాశాలు పెరుగుతాయి.
 
స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉండడానికి గల కారణాల్లో ఇవి కూడా వుంటాయి : జింక్ ధాతు లోపం : కాబట్టి జింక్ అధికంగా ఉండే ఆహారాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వండి
ఎక్కువగా ధూమ పానం, మద్య పానం చేయడం: స్పెర్మ్ కౌంట్ సహజంగా పెంచుకోవాలంటే, మద్యం, సిగరెట్లు మానేయాలి.
బిగుతైన లోదుస్తులు ధరించడం: బిగుతైన లోదుస్తులు ధరించడం వల్ల వీర్యకణాలు వ్రుద్దికాకపోవచ్చ. కాబట్టి సాద్యమైనంత వరకూ లోదుస్తులు వదులుగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. వృషణాలు వేడెక్కకుండా ఉండేందుకు బిగుతైన లోదుస్తులు వేయడం మానేయండి.
అధిక బరువు వుండడం : అధిక బరువు తగ్గించుకోవాలి.
అలసి పోవడం : అలసట కూడా ఆరోగ్యపరంగా చెడు ప్రభావాన్ని చూపెడుతుంది.
ఒత్తిడి: ముఖ్యంగా స్ట్రెస్ అనేది అనేక ఆరోగ్య సమస్యలతో పాటు స్పెర్మ్ కౌంట్ ను కూడా తగ్గిస్తుంది.
స్పెర్మ్ లోపాలు మీ స్పెర్మ్ కౌంట్ స్పెర్మ్ లోపాలు మీ స్పెర్మ్ కౌంట్ ను, దాని నాణ్యతను, కదలికలను ప్రభావితం చేస్తాయి. వీర్యం తరచుగా బయటకు రాకపోతే వాటి చలన శక్తి పాడైపోతుంది. స్పెర్మ్ లోపాలు దాని ఆకారాన్ని కూడా పాడు చేస్తాయి. స్ఖలనం, సంతానోత్పత్తి లేకపోవడం దృష్ట్యా చూస్తె అంగ స్తంభన లేక పోవడం, స్ఖలించలేక పోవడం లేదా శృంగారంలో ముందుగానే స్ఖలించి వేయడం లాంటివి గర్భధారణకు కూడా ఇబ్బందికరమే. సాధారణ స్పెర్మ్ కౌంట్ ఒక స్ఖలనానికి సాధారణ పరిమాణం 1.5 నుంచి 5.0 మిల్లియన్ల దాకా వుంటుంది. మిల్లీమీటర్ కు వీర్య కణాల సంఖ్య 20 నుంచి150 మిల్లియన్ల వరకూ వుంటుంది. వీటిలో కనీసం 60% వీర్య కణాలు సాధారణ ఆకారం కలిగి వుండి, సాధారణంగా ముందుకు కదులుతూ వుండాలి. (చలనశీలత).
స్పెర్మ్ కౌంట్ ను పెంచ గలిగే విటమిన్లు : 1) విటమిన్ బి : విటమిన్ బి వనరులు : వెన్న, గుడ్లు, పాలు, మీగడ, బలవర్ధకమైన ధాన్యాలు, బచ్చలి కూర, కాయ ధాన్యాలు, తృణ ధాన్యాలు, గింజ ధాన్యాలు.
జింక్ : జింక్ వనరులు : ముత్యపు చిప్పలు, నువ్వులు, పొద్దు తిరుగుడు పూవు గింజలు, అల్లం, గోధుమ గడ్డి, ఎర్రటి మాంసం, డార్క్ చాకొలేట్, పుచ్చకాయ గింజలు, గుమ్మడి గింజలు.
సెలీనియం : సెలీనియం వనరులు : నత్తగుల్లలు, కాలేయం, చేప, పొద్దుతిరుగుడు గింజలు, ఎంద్రకాయలు, రొయ్యలు, పీతలు, బియ్యం, గోధుమలు, ఓట్ లతో చేసిన ధాన్యాలు
Next
This is the most recent post.
Previous
Older Post

Dear readers, after reading the Content please ask for advice and to provide constructive feedback Please Write Relevant Comment with Polite Language.Your comments inspired me to continue blogging. Your opinion much more valuable to me. Thank you.