మన ఇంజనీరింగ్: దిమ్మతిరిగే సర్వే ఫలితాలు .

No Comments
హైదరాబాద్‌: ఉన్నత చదువుల కోసం వెళ్లిన భారత విద్యార్థులను అమెరికా విమానాశ్రయాల్లోంచే వెనక్కి పంపుతున్న వైనం పలు విషయాలను చర్చలోకి తెస్తోంది. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్తున్న విద్యార్థుల్లో తెలుగువారు ఎక్కువగా ఉండడం కూడా ఆసక్తికరమైన విషయమే. ఈ స్థితిలో ఆస్పైరింగ్ మైండ్ సంస్థ నిర్వహించిన సర్వే ఫలితాలు దిమ్మతిరిగే విషయాలను వెల్లడిస్తోంది. భారత్‌లో కుస్తీలు పట్టి ఇంజనీరింగ్ విద్యును అభ్యసిస్తున్న చాలా మందికి ఇంగ్లీష్ ఏ మాత్రం రావడం లేదనే విషయాన్ని ఆ సర్వే బయటపెట్టింది. ఎదుటివారితో సంభాషించడానికి తగిన ఆంగ్ల నైపుణ్యం కూడా ఉండడం లేదని ఆ సర్వే చెబుతోంది. ఇంగ్లీష్ సరిగా రాకపోవడం వల్లనే చాలా మందికి ఉద్యోగాలు రావడం లేదని ప్లేస్‌మెంట్ సర్వీసులు నిర్వహించే ఆస్పైరింగ్ మైడ్స్ అనే సంస్థ తన సర్వేలో వెల్లడించింది. దేశంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్‌లో పరిస్థితి మరింత అధ్వానంగా ఉందని, ఇక్కడి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో సగం మందికి పైగా ఆంగ్ల పరిజ్ఝానం లేదని సంస్థ వెల్లడించింది. దేశంలో యేటా 6 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటకు వస్తుండగా, వారిలో 51.2 శాతం మందికి ఇంగ్లీష్ మాట్లాడడం సరిగా రాకపోవడం వల్ల ఉద్యోగాలు లభించడం లేదని సంస్థ సర్వేలో తేలింది.  Only 18% engineering grads are employable, says survey ప్రముఖ కంపెనీలు, కార్పోరేట్ సంస్థల అవసరాలకు అనుగుణంగా ఇంగ్లీష్‌లో అన్ని రకాల సామర్థ్యాలు ఉన్న గ్రాడ్యుయేట్లు కేవలం 2.9 శాతం మందేనని తేలింది. ఇంగ్లీష్‌లో అమ్మాయిలు బాగా రాయగలుగుతుండగా, అబ్బాయిలు బాగా మాట్లాడగలుగుతున్నారు. మామూలు పదాలు తెలిసినవారు 33 శాతం మంది ఉంటే, సాధారణ వ్యాకరణ నిర్మాణం తెలిసినవారు కేవలం 25 శాతం మందేనని తేలింది. ఆస్పైరింగ్ మైడ్స్ సంస్థ సర్వే నివేదిక వెల్లడించిన విషయాల ప్రకారం - దేశంలోని మెట్రో నగరాలు, ప్రముఖ పట్టణాలతో పోలిస్తే హైదరాబాద్, చెన్నై గ్రాడ్యుయేట్లు బాగా వెనకబడి ఉన్నారు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో ఉచ్చారణ విషయాననికి వస్తే 6.6 శాతం మంది బాగా మాట్లాడగలిగారని, సులభంగా అర్థం చేసుకోగలిగారని తేలింది. పదాలను స్పష్టంగా, వేగంగా ఉచ్చరించగలిగే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఢిల్లీలో 59.9 శాతం మంది ఉండగా, బెంగళూరులో 58.3 శాతం మంది, ముంబై పూణేల్లో 56.2 శాతం మంది, కోల్‌కతాలో 52 శాతం మంది, హైదరాబాద్‌లో 51 శాతం మంది, చెన్నైలో 46.7 శాతం మంది ఉన్నారు. ఇంగ్లీష్ బాగా మాట్లాడగలిగేవారిలో ముంబై పూణేలకు చెందిన గ్యాడ్యుయేట్లు 60.6 శాతం ఉండగా, ఢిల్లీకి చెందినవారు 57.7 శాతం మంది, హైదరాబాద్‌కు చందినవారు 52.6 శాతం, చెన్నైకి చెందినవారు 47.3 శాతం మంది ఉన్నారు. మొత్తం మీద, ఇంగ్లీష్ సరిగా రాకపోవడం వల్లనే 51.9 శాతం మందికి ఉద్యోగాలు రావడం లేదని ఆస్పైరింగ్ మైడ్స్ సంస్థ సర్వే తెలిపింది.

Dear readers, after reading the Content please ask for advice and to provide constructive feedback Please Write Relevant Comment with Polite Language.Your comments inspired me to continue blogging. Your opinion much more valuable to me. Thank you.