గౌరవిస్తా! ఇన్‌క్రెడిబుల్ ఇండియానే: అమీర్ ఖాన్

No Comments
ముంబై: ‘ఇన్‌క్రెడిబుల్ ఇండియా' ప్రచారకర్తగా బాలీవుడ్‌ నటుడు అమీర్‌ఖాన్‌ను తొలగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అమీర్‌ స్పందించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తాను గౌరవిస్తున్నానని ఆయన తెలిపారు. దాదాపు పదేళ్లపాటు ఆయన ప్రచారకర్తగా వ్యవహరించారు. తాను ఉన్నా లేకపోయినా భారత్‌ ఉజ్వలమే(ఇన్‌క్రెడిబుల్ ఇండియానే) అని అన్నారు. ఏదైనా ప్రభుత్వ కార్యక్రమానికి ప్రచారకర్త ఉండాలా లేదా ఎవరు ఉండాలి అనే అంశం పూర్తిగా ప్రభుత్వ నిర్ణయమని, ప్రభుత్వ నిర్ణయాన్ని తాను గౌరవిస్తున్నానని అమీర్ ఖాన్ స్పష్టం చేశారు. ఇటీవల అసహనంపై ఆమీర్‌ఖాన్‌ మాట్లాడిన అంశం వివాదాస్పదమైన విషయం తెలిసిందే.  Whether I am brand ambassador or not, India will remain Incredible: Aamir Khanఒప్పందం ముగిసింది కేంద్ర ప్రభుత్వ ‘ఇన్‌క్రెడిబుల్ ఇండియా' ప్రచార కార్యక్రమం నుంచి అమీర్‌ ఖాన్‌ని తొలగించినట్లు వచ్చిన వార్తలను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి మహేశ్‌ శర్మ ఖండించారు. ప్రభుత్వం ఆయనను తొలగించనున్నట్లు బుధవారం ఒక వర్గం మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం స్పష్టత నిచ్చింది. ఇన్‌క్రెడిబుల్ ఇండియా ప్రచారానికి మెక్‌కాన్‌ వరల్డ్‌ గ్రూప్‌ అడ్వర్టయిజింగ్‌ ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకున్నామని, అమీర్‌ ఖాన్‌తో సామాజిక చైతన్యం కలిగించే ప్రకటనలు రూపొందించడం అందులో భాగమని పేర్కొంది. ఒప్పందం మేరకు పని జరిగిందని ఇందులో కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రమేయమేమీ లేదని స్పష్టం చేశారు.

Dear readers, after reading the Content please ask for advice and to provide constructive feedback Please Write Relevant Comment with Polite Language.Your comments inspired me to continue blogging. Your opinion much more valuable to me. Thank you.