నీ అశ్లీల చిత్రాలున్నాయి, కోటి ఇస్తావా లేక: బెదిరింపు, సినీ ఫక్కీలో అరెస్ట్

No Comments
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా మలికిపురం, ఉయ్యూరివారి మెరకకు చెందిన నలుగురు ఆకతాయిలు సెల్ ఫోన్లో ఏదో ఒక నెంబర్‌కు ఫోన్ చేస్తారు. ఆడవారు ఫోన్ ఎత్తితే వారికి తరుచూ కాల్ చేయడం, వారితో ఫోన్ స్నేహం కొనసాగించడం చేస్తారు. ఈ క్రమంలో సఖినేటిపల్లి మండలానికి చెందిన ఓ యువతి ఆకతాయిలకు ఫోన్ ద్వారా కలిసింది. ఈ ఆకతాయిలు ఆమెకు తరుచూ ఫోన్ చేసి.. తమ వద్ద ఆమె అశ్లీల చిత్రాలు ఉన్నాయని, రూ.కోటి ఇస్తే ఓకే లేదంటే చంపమంటావా అని బ్లాక్ మెయిల్ చేశారు. Youth arrested in East Godavari for blackmailing girl ఈ విషయాన్ని యువతి తల్లిదండ్రులకు చెప్పింది. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆకతాయిలకు చెక్ పెట్టేందుకు పోలీసులు ఆపరేషన్ మొదలు పెట్టారు. గత నెల 22వ తేదీ నుంచి ఈ యువకులతో ఫోన్ సంభాషణ కొనసాగిస్తూ మాటలను రికార్డ్ చేశారు. రూ.10 లక్షలకుబేరం కుదిర్చి సోమవారం ఇవ్వడానికి నిర్ణయించారు. ఈ ఆకతాయీలు సినీ స్టయిల్లో దిండి వద్ద తమకు డబ్బు అందించాలని సూచించారు. పోలీసు స్టేషన్ ఎస్సై కారు డ్రైవర్‌గా, బాధిత యువతి స్నేహితురాలు బాధితురాలిగా వెళ్లారు. మరో నలుగురు పోలీసులను ఆపరేషన్‌కు ఉపయోగించారు. ఎట్టకేలకు వారిని పట్టుకున్నారు. నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మరో ఇద్దరు అనుమానితులను విచారిస్తున్నారు.
Youth arrested in East Godavari for blackmailing girl

Dear readers, after reading the Content please ask for advice and to provide constructive feedback Please Write Relevant Comment with Polite Language.Your comments inspired me to continue blogging. Your opinion much more valuable to me. Thank you.