ఫోన్‌లను అక్కడ పెట్టకండి.!

No Comments
ఎవరి జేబులో చూసినా స్మార్ట్‌ఫోన్‌లే కనిపిస్తున్నాయి. మగవారు ప్యాంట్ జేబుల్లోనూ, ఆడవారు జాకెట్లు, బ్రాలలో ఫోన్‌లు ఉంచటం పరిపాటిగా మారిపోయింది. ఈ అలవాటు ఆరోగ్యరిత్యా ప్రమాదకరమైనదని ప్రముఖ సైంటిస్ట్, మహిళా హెల్త్ అడ్వకేట్ డాక్టర్ లీ డేవిస్ హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ప్రదేశాల్లో ఫోన్‌లను ఉంచటం వల్ల క్యాన్సర్, ట్యూమర్స్ వంటివి సంభవించే అవకాశముందని అంటున్నారు. మొబైల్ ఫోన్ వినియోగానికి సంబంధించి ఆసక్తికర విషయాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు..

ఫోన్‌లను అక్కడ పెట్టకండి మహిళలు మొబైల్ ఫోన్‌లను బ్రాలలో పెట్టుకోవటం వల్ల వక్షోజాల్లో ట్యూమర్‌లు ఏర్పడే ప్రమాదముందట. ఓ మహిళ సెల్ ఫోన్‌ను పదేపదే బ్రాలో పెట్టుకోవటం వల్ల క్యాన్సర్ చికిత్స చేయించుకోవల్సి వచ్చిందట.

ఫోన్‌లను అక్కడ పెట్టకండి మొబైల్ ఫోన్‌లను ప్యాంట్ జేబులో పెట్టుకోవటం వల్ల వీర్య కణాల పై ఆ ప్రభావం ఉంటుందట.
ఫోన్‌లను ఎక్కడ పడితే అక్కడ పెట్టకండి స్మార్ట్‌ఫోన్‌ల నుంచి విడుదలయ్యే రేడియేషన్ కారణంగా శరీర భాగాలు తీవ్ర ఒత్తిడికి లోనయ్యే ప్రమాదముందట.
ఫోన్‌లను ఎక్కడ పడితే అక్కడ పెట్టకండి మొబైల్ ఫోన్ రేడియోషన్ క్యాన్సర్‌కు కారణమవటంతో పాటు డయాబెటిస్, డిప్రెషన్ ఇంక గుండె సంబంధిత వ్యాధులకు కారణం కాగలదట.
ఫోన్‌లను ఎక్కడ పడితే అక్కడ పెట్టకండి మొబైల్‌ను అధికంగా ఉపయోగించటం కారణంగా తలనొప్పి, జ్ఞాపకశక్తి తగ్గుదల, చెవి సంబంధిత సమస్యలు ఏర్పడే ప్రమాదముందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఫోన్‌లను ఎక్కడ పడితే అక్కడ పెట్టకండి న్యూరాలజిస్టులను సంప్రదిస్తున్న బాధితుల్లో అధికశాతం మంది సెల్ కారణంగా సమస్యలను కొనితెచ్చుకుంటున్నవారేనట.
 
ఫోన్ సేప్టీ టిప్స్ గర్భిణీలు సెల్‌కు దూరంగా ఉంటే బిడ్డకు మేలు చేసినట్లే.
ఫోన్ సేఫ్టీ టిప్స్ చిన్నారులు సెల్‌ఫోన్‌ ఉపయోగించడం వల్ల రేడియోషన్‌ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ వయస్సులో పెరిగే బ్రెయిన్‌పై రేడియోషన్‌ ప్రభావం పడితే చిన్నారులు జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రమాదం ఉంది.
ఫోన్ సేఫ్టీ టిప్స్ గుర్తుంచుకోండి: మొబైల్‌ ఒక పరికరం మాత్రమే. అది మన దేహంలో, జీవితంలో అంతర్భాగం కాదు.. కాకూడదు 
 
ఫోన్ రేడియోషన్ నుంచి బయటపడాలంటే ఫోన్ రేడియోషన్ నుంచి బయటపడేందుకు అనేక మొబైల్ యాక్సెసరీస్ మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి. ఈ సెక్యూరిటీ గాడ్జెట్స్ అందుబాటులో ఉన్నప్పటికి కొన్ని సందర్భాల్లో ఫోన్ ను చెవి దగ్గరగా పెట్టుకుని మాట్లాడవల్సి వస్తుంది. ఈ నేపధ్యంలో మీరున్న లోకేషన్‌ను బట్టి ఫోన్ రేడియేషన్‌ను ఓ కంట కనిపెట్టే సరికొత్త స్మార్ట్‌ఫోన్ యాప్ మార్కెట్లో లభ్యమవుతోంది. ఈ యాప్ పేరు ‘మాగ్నా రేడియేషన్ ప్రొటెక్షన్' . గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఉచితంగా పొందవచ్చు. ఈ యాప్‌ను మీ ఫోన్‌లో ఇన్స్‌స్టాల్ చేసుకోవటం ద్వారా మీరు ఉన్న ప్రదేశంలో అన్ని ఇన్‌కమింగ్, అవుట్ గోయింగ్ కాల్స్‌కు సంబంధించి రేడియేషన్ శాతాన్ని తెలుసుకోవచ్చు. ఒక వేళ మీరు ఉన్న వాతావరణంలో రేడియేషన్ శాతం ఎక్కువగా ఉన్నట్లయితే యాప్ మిమ్నల్ని అప్రమత్తం చేస్తుంది.

Dear readers, after reading the Content please ask for advice and to provide constructive feedback Please Write Relevant Comment with Polite Language.Your comments inspired me to continue blogging. Your opinion much more valuable to me. Thank you.