ట్రాయ్‌, ఫేస్‌బుక్ మధ్య ముదిరిన ఈ-మెయిల్ యుద్ధం

No Comments
ఫేస్‌బుక్ ఈ మధ్య ప్రవేశపెట్టిన ప్రీ బేసిక్స్ పెద్ద దుమారాన్నే రేపుతోంది. ఎలాగైనా దాన్ని అమల్లోకి తీసుకురావాలని ఫేస్‌బుక్ అలాగే దాన్ని ఇండియా నుంచి తరిమి కొట్టాలని వ్యతిరేకవాదులు ఇలా ఎవరికి వారే యుద్ధానికి రెడీ అవుతున్నారు. ట్రాయ్ ఆంక్షలపై సైతం ఫేస్‌బుక్ ఇప్పుడు యుద్దాన్ని ప్రారంభించింది. ఇందుకోసం వందల కోట్ల రూపాయలను మంచి నీళ్లలా ఖర్చు చేస్తోంది. నిబంధనలు ముగిసినా కాని ఈ మెయిల్ యుద్దంతో ఫేస్‌బుక్ ముందుకు దూసుకొస్తుంది.

ఇంటర్నెట్ పై విధించే ఆంక్షలు, నియంత్రణల వల్ల ...
 ప్రజలందరికీ ఇంటర్నెట్ అందకూడని పరిస్థితి ఏర్పడ కూడదని ఫేస్‌బుక్ సంస్థ కొత్త ప్రచారం మొదలుపెట్టింది.
పలు వెబ్‌సైట్లు, సర్వీసులను ఉచితంగా అందించేలా 
పలు వెబ్‌సైట్లు, సర్వీసులను ఉచితంగా అందించేలా తీసుకువచ్చిన 'ఫ్రీబేసిక్స్' ప్లాట్‌ఫామ్‌కు మద్దతు కూడగట్టడంలో భాగంగా ట్రాయ్ నెట్ న్యూట్రాలిటీ నిబంధనలపై ఆ సంస్థ ఈమెయిల్ యుద్ధం ప్రారంభించింది.
'ఫ్రీబేసిక్స్'ప్లాట్‌ఫామ్‌కు అనుమతివ్వడమంటే 
'ఫ్రీబేసిక్స్'ప్లాట్‌ఫామ్‌కు అనుమతివ్వడమంటే ఇంటర్నెట్లో కొన్ని సంస్థలు, వెబ్‌సైట్లకు గుత్తాధిపత్యం ఇవ్వడమేనంటూ తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.
'ఇంటర్నెట్ తటస్థత (నెట్ న్యూట్రాలిటీ)' కు ఫ్రీ బేసిక్స్ భంగకరమంటూ
 దీంతో 'ఇంటర్నెట్ తటస్థత (నెట్ న్యూట్రాలిటీ)' కు ఫ్రీ బేసిక్స్ భంగకరమంటూ ట్రాయ్ పలు నిబంధనలను అమల్లోకి తెచ్చింది. అయితే ఈ అంశంలో ప్రజాభిప్రాయం సేకరించేందుకు సిద్ధమైంది. దీనికి గురువారంతో గడువు ముగుస్తోంది
ఈ నేపథ్యంలో ఫ్రీబేసిక్స్ కు మద్దతు కూడగట్టుకునేందుకు 
ఈ నేపథ్యంలో ఫ్రీబేసిక్స్ కు మద్దతు కూడగట్టుకునేందుకు ఫేస్‌బుక్ సంస్థ పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టింది. దేశవ్యాప్తంగా పత్రికల మొదటి పేజీల్లో ప్రకటనలు ఇవ్వడంతోపాటు ఈమెయిల్ ప్రచారాన్నీ చేపట్టింది.
ఫ్రీ బేసిక్స్ గురించి ఇండియాలో ప్రచారం చేయడం కోసం 
ఫ్రీ బేసిక్స్ గురించి ఇండియాలో ప్రచారం చేయడం కోసం ఫేస్‌బుక్ కంపెనీ రు 100 కోట్ల రూపాయలను మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు పెడుతోంది. హోర్డింగ్ లు, వీడియో అడ్వర్టైజ్ మెంట్లు తదితర సాధనాలతో ప్రచారం చేస్తోంది
 
ఫ్రీ బేసిక్స్ ను ఇండియాలో ప్రవేశపెట్టకుండా
 ఫ్రీ బేసిక్స్ ను ఇండియాలో ప్రవేశపెట్టకుండా టెలికాం రెగ్యులేటరీ ఆధారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తాత్కాలిక నిషేధం విధించింది. ఈ అంశంపై కన్సల్టేషన్ పేపర్ విడుదల చేస్తూ ఆ పేపర్ పై చర్చ పూర్తయి ఒక నిర్ణయానికి వచ్చేవరకూ ఫ్రీ బేసిక్స్ ఇండియాలో (ఇంటర్నెట్ ద్వారా) అడుగు పెట్టకూడదని ఆదేశించింది.
 
కానీ ట్రాయ్ ఆదేశాలు ఫేస్ బుక్ లెక్క చేయడం లేదు 
యధేచ్ఛగా తన వేదిక గురించి ప్రచారం చేస్తోంది. ఆయన ఇండియా వస్తే మన నేతలు ఉరుకులు పరుగులు పెడుతూ ఆయన ఆశీర్వాదం కోసం పాకులాడుతున్నారు గానీ ఫ్రీ బేసిక్స్ పేరుతో ఆయన గారు తలపెట్టిన 'అంతర్జాతీయ
 
ఫ్రీ బేసిక్స్ అంటే మౌలిక (బేసిక్) సౌకర్యాలను ఉచితంగా అందించడం 
ఫ్రీ బేసిక్స్ అంటే మౌలిక (బేసిక్) సౌకర్యాలను ఉచితంగా అందించడం అని విడమరిచి చెబుతోంది ఫేస్ బుక్ అది సరిగా లేదని అందరూ ఇప్పుడు యుద్దం చేస్తున్నారు. 1.2 బిలియన్ల భారత ప్రజల సమస్త వివరాలను (డేటా) సేకరించి నిలవ చేసుకుని, అమ్ముకుని సొమ్ము చేసుకునే ఘరానా మోసపూరిత ఎత్తుగడే ఫ్రీ బేసిక్స్ అని పలువురు చెబుతున్నారు.
 
గూగుల్, మైక్రోసాఫ్ట్, యాహూ, యాపిల్ తదితర కంపెనీలు 
ఈ పనిని ఫ్రీ బేసిక్స్ తో పాటు గూగుల్ (యాండ్రాయిడ్ తో సహా), మైక్రోసాఫ్ట్, యాహూ, యాపిల్ తదితర లక్షల కోట్ల రూపాయల కంపెనీలు ఇప్పటికే చాటుగా చేస్తున్నాయి. చెప్పకుండా చేస్తున్నాయి. ఉచిత సర్వీసుల మాటున చేస్తున్నాయి.
 
ఇప్పుడు ఎందుకూ పనికిరాదనుకున్న బేసిక్ డేటా 
ఇప్పుడు ఎందుకూ పనికిరాదనుకున్న బేసిక్ డేటా కూడా రానున్న రోజుల్లో అత్యంత విలువైన సమాచారంగా అవతరిస్తుంది. ప్రజల డేటా (వారి పేర్లు, అడ్రస్ లు, లొకేషన్ లు, ఫోన్ నంబర్లు -మీవి, మీ కుటుంబ సభ్యులవి, మీ మిత్రులవి కూడా ఎంత ఎక్కువ సేకరించి పెట్టుకుంటే ఇంటర్నెట్ కంపెనీలకు అంత ఎక్కువ ప్రకటనల ఆదాయం వస్తుంది
 
ఫ్రీ బేసిక్స్ వల్ల మరో పెద్ద ప్రమాదం 'నెట్ న్యూట్రాలిటీ' 
ఆవిరైపోవడం ఫ్రీ బేసిక్స్ వల్ల మరో పెద్ద ప్రమాదం 'నెట్ న్యూట్రాలిటీ' ఆవిరైపోవడం. ప్రజల ఆర్ధిక స్తోమతతో పని లేకుండా దాదాపు ఇంటర్నెట్ సమాచారం మొత్తం ఇప్పుడు ఉచితంగా అందుబాటులో ఉంటున్నది. ఫ్రీ బేసిక్ వేదికలో వివిధ ఇంటర్నెట్ వెబ్ సైట్లు, డవలపర్లు, ఫ్లిప్ కార్ట్ లాంటి అనేకానేక కమర్షియల్ కంపెనీలు చేరాలని ఫేస్ బుక్ ఆకర్షిస్తున్నందున ఇక ముందు ప్రజలందరికీ సమాన సేవలు దూరం అవడం ఖాయం.
 
ఫేస్‌బుక్ కొనుగోలు చేసిన వాట్సప్ ఇప్పటికే 
ఫేస్‌బుక్ కొనుగోలు చేసిన వాట్సప్ ఇప్పటికే 'త్వరలో డబ్బు కట్టాలి' అని నోటీసులు ఇస్తోంది. ఫేస్‌బుక్ కూడా త్వరలో అలాగే తయారవుతుంది. ఉచిత సేవల మాటున డేటా దొంగిలిస్తూ కూడా సేవలను పరిమితం చేసే కుటిల ఎత్తుగడ ఫేస్‌బుక్ కంపెనీ అమలు చేస్తుంది.
 
ఇలాంటి చాలా ఎత్తుగడలనే వేసి ఫేస్‌బుక్ 
ఇలాంటి చాలా ఎత్తుగడలనే వేసి ఫేస్‌బుక్ తన ప్రయత్నాలకు ఇంకా ఇంకా పదును పెడుతుందని విశ్లేషకులు సెలవిస్తున్నారు..మరి ముందు ముందు ఇది ఏ తీరాలకు చేరుతుందో చూడాలి.

Dear readers, after reading the Content please ask for advice and to provide constructive feedback Please Write Relevant Comment with Polite Language.Your comments inspired me to continue blogging. Your opinion much more valuable to me. Thank you.