చిన్న వయస్సులోనే బట్టతలకు ఏర్పడుటకు గల కారణాలు.

1 comment
అందంగా కనబడుటకు కేశాలకు చాలా ముఖ్య పాత్రను పోషిస్తాయి . స్త్రీలైనా, పురుషులైనా అందానికి అదనపు ఆకర్షణ జుట్టు. అలాంటి జుట్టును కోల్పోవడం వల్ల వ్యక్తులను మరింత ఒత్తిడికి గురి చేస్తుంది. అందుకు కారణం కోల్పోయిన జుట్టు తిరిగి పెరగకపోవడమే. ఈ విషయంలో ఎక్కువగా పురుషులను గమనించినట్లైతే తెలుస్తుంది. కోల్పోయిన జుట్టు తిరిగి పెరగకపోవడం వల్ల బట్టతలకు కారణం అవుతుంది . ఒక్క సారి జుట్టు రాలడం ప్రారంభమైతే అది తిరిగి పెరగడానికి కష్టం అవుతుంది. అందుకు అన్ని రకాల ట్రీట్మెంట్స్ ను వారు ప్రయత్నించి ఉంటారు. అకాలంలోనే(తక్కువ వయస్సులోనే)బట్టతల, ఇలా చిన్న వయస్సులోనే బట్టతల రావడం అనేది చాలా సాధారణ సమస్యగా మారింది. అంతే కాదు చిన్న వయస్సులో బట్టతల వల్ల ఎన్నో ఇబ్బందులుకు గురౌతుంటారు....20-30లోపు వారు పెళ్ళయి, ఉద్యో గంలో స్థిరపడిన వాళ్ళకు కూడా బట్టతల సమస్యగా మారుతుంది. భార్య చిన్న వయస్కు రాలిగా కనిపిస్తుంటుంది. వెంటవెళ్ళే భార్యను చూసి, మీ అంకులా అని అడుగుతుంటారు. పిల్లలను వెంట తీసుకెళితే- మీకు ఇంత ఇంత చిన్న పిల్లలా? అని వచ్చే ప్రశ్నల ధాటికి ఏం సమాధానం చెప్పాలో తెలియక తెల్లమొహం వేస్తుంటారు. ఇంకొంచెం పెద్ద పిల్లలను- తోటి స్నేహితులు- మీ నాన్న ఏంటీ, అంత పెద్దాయన అని అడుతుంటారు. భార్యలను, ఆయనకు మీరు రెండో భార్యా అని అడుగుతుంటారు. ఇవన్నీ కూడా - బట్టతల ఉన్నవారు నిత్యజీవితంలో ఆయా సందర్భాలలో ఎదురయ్యే సవాళ్ళే! పురుషుల్లో బట్టతలను నివారించే సర్ ప్రైజింగ్ రెమెడీస్ ... నిజానికి ఇవి సవాళ్ళేం కావు. అయినా అలా అనిపిస్తుంటుందంతే! ఇలాంటి సందర్భాల్లో వాళ్ళ బాధ వర్ణనాతీతం. వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలకు కూడా కొంతవరకు ఇబ్బంది కరంగానూ, నామోషిగాను ఉంటుంది. వ్యక్తిగత, మానసిక, సామాజిక, ఉద్యోగ, వివాహ, ఇతరత్రా ఎన్నో సమస్యలకు, వర్ణనాతీతమైన బాధకు మూలకారణంగా నిలచే ఈ బట్టతలకు పరిష్కారంలేదా? అంటే ఖచ్చితంగా ఉందనే చెప్పాలి. ఎందుకంటే బట్టతలకు గల కారణాలను జుట్టు రాలడం ప్రారంభమైనప్పుడే గుర్తించినట్లైతే ఈ సమస్య నుండి బయటపడవచ్చు . కొందరు హెయిర్ ఎక్సపర్ట్ అభిప్రాయం ప్రకారం, హెయిర్ లాస్ కు ముఖ్య కారణం సరైన పరిశుభ్రత పాటించకపోవడం. చాలా వరకూ సిటీస్ లో ఉండే వారు ఉరుకుల పరుగుల జీవితంగా తినడానికే సమయం ఉండదు, ఇక హెయిర్, స్కిన్ హెల్తీ మెయింట్ చేయడం ఎలా అని బెంగపడుతుంటారు. అంతే కాదు ఈ రన్నింగ్ లైఫ్ స్టైల్లో ఉండే మోడ్రన్ హ్యాబిట్స్ స్మోకింగ్, డ్రగ్ అడిక్షన్స్, వంటివి మరియు ఒత్తిడి కూడా బట్టతలకు ముఖ్య కారణం. పురుషుల్లో బట్టతలను నివారించే బెస్ట్ హోం రెమడీస్ ఈ బ్యాడ్ హ్యాబిట్స్ తో పాటు, సరైన హైజీనిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల చిన్నవయస్సులో జుట్టు రాలడం ప్రారంభమతుంది. దాంతో బట్టతలకు దారితీస్తుంది. జుట్టురాలడం ప్రారంభమైనప్పుడు వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే బట్టతలకు దారితీస్తుంది. కాబట్టి, ఈ బ్యాట్ హ్యాబిట్స్ కు బాయ్ బాయ్ చెప్పేస్తే ఎర్లీ ఏజ్ లో జుట్టు రాలే సమస్యలను అరికట్టవచ్చు. మరి చిన్న వయస్సులోనే జుట్టు ఎందుకు ఊడిపోతుందో తెలుసుకోవాలంటే ఈ క్రింది స్లైడ్ క్లిక్ చేయాల్సిందే....
         చిన్న వయస్సులోనే బట్టతలకు ఏర్పడుటకు గల  కారణాలు
1. షాంపులు సరైనవి వాడకపోవడం :
తలకు సరైన షాంపును ఉపయోగించకపోవడం వల్ల, చిన్న వయస్సులో జుట్టు రాలడానికి ప్రధాన కారణం అవుతుంది . జుట్టు చలా పల్చగా, చిన్నగా ఉన్నట్లైతే మన్నికైన షాంపును ఉపయోగించడం ఉత్తమం . ఇవి కేశాలు తిరిగి స్ట్రాంగ్ గా మారడానికి సమాయపడుతాయి . తలకు కెమికల్స్ బేస్డ్ షాంపులను ఉపయోగించడం నివారించాలి . లేదంటే ఇవి మరింత హెయిర్ డ్యామేజ్ కు గురి అవుతుంది.
2. తలకు వేడినీళ్ళ స్నానం:
తలకు వేడి వేడిగా నీళ్ళు పోసుకోవడం వల్ల జుట్టు త్వరగా రాలిపోయి బట్టతలకు కారణం అవుతుంది. ఇలా చాలా వేడి నీళ్ళతో తలస్నానం చేయడం వల్ల తలో నేచురల్ ఆయిల్స్ తగ్గిపోవడం వల్ల జుట్టు డ్రైగా మరియు డల్ గా మారుతుంది. హాట్ వాటర్ హెయిర్ రూట్స్ ను కూడా నాశనం చేస్తుంది దాంతో జుట్టు రాలడం ప్రారంభం, యంగ్ ఏజ్ లో బట్టతల.

3. హార్డ్ వాటర్:
హెయిర్ ఫాలీసెల్స్ కు హార్డ్ వాటర్ ఉపయోగించడం వల్ల . ఈ నీళ్లు జుట్టును డ్యామేజ్ చేస్తాయి. ఇవి హెయిర్ రూట్స్ ను వదులుగా మార్చి వేగంగా జుట్టు రాలడానికి కారణం అవుతుంది. కాబట్టి తలస్నానాకి మినిరల్ లేదా సాఫ్ట్ వాటర్ ను ఉపయోగించడం మంచిది.

4. హెయిర్ ప్రోడక్ట్స్ ను ఎక్కువగా ఉపయోగించడం: 
చిన్న వయస్సులో బట్టతలకు మరో చెడు అలవాటు, ఈ రెగ్యులర్ హెయిర్ ప్రొడక్ట్స్ వాడకం వల్ల హెయిర్ రూట్స్ దెబ్బతిని, జుట్టు రాలడానికి కారణం అవుతుంది. దాంతో బట్టతలకు దారితీస్తుంది. కాబట్టి, ప్రారంభంలోనే గుర్తించి హోం మేడ్ హెయిర్ మాస్క్ లకు ప్రాధాన్యత ఇవ్వాలి.
 
5. సూర్య రశ్మి:
 సూర్య రశ్మి నుండి హానికరమైన యూవీ రేస్ చర్మానికి ఎలా హానికలిగిస్తాయో, జుట్టుకు కూడా హాని కలిగిస్తాయి . సూర్య రశ్మి నుండి వెలువడే వేడి వల్ల జుట్టు డ్రై గా మరియు వీక్ గా మారుతుంది. దాంతో బట్టతలకు కారణం అవుతుంది.
 
6. మెడికేషన్స్:
 కొన్ని రకాల మందులు జుట్టు రాలడానికి కారణం అవుతాయి. అదేక్రమంలో మహిళలు ఎవరైతే బర్త్ కంట్రోల్ పిల్స్ రెగ్యులర్ గా తీసుకుంటుంటారో వారిల్ హెయిర్ ప్రాబ్లమ్స్ హై రిస్క్ లో ఉంటాయి.

7. ఒత్తిడి కిల్లర్:
పురుషుల్లో బట్టతలకు మరో ప్రధాన కారణం నిరంతరం ప్రెజర్ తో మరియు ఒత్తిడితో జీవించడం . హెయిర్ కేర్ నిపుణులు ప్రకారనం ఒత్తిడి జుట్టు రాలడానికి మరియు ఇతర చర్మ సంబంధిత సమస్యలకు కారణం అవుతుందని అంటున్నారు. అందువల్ల సాధ్యమైనంత వరకూ ఒత్తిడికి దూరంగా ఉంటూ, హెల్తీ లైఫ్ ను పొందడమే మంచి మార్గం. S

1 comments:

చిన్న వయస్సులోనే బట్టతలకు ఏర్పడుటకు గల కారణాలు. - King >>>>> Download Now

>>>>> Download Full

చిన్న వయస్సులోనే బట్టతలకు ఏర్పడుటకు గల కారణాలు. - King >>>>> Download LINK

>>>>> Download Now

చిన్న వయస్సులోనే బట్టతలకు ఏర్పడుటకు గల కారణాలు. - King >>>>> Download Full

>>>>> Download LINK 4f

Dear readers, after reading the Content please ask for advice and to provide constructive feedback Please Write Relevant Comment with Polite Language.Your comments inspired me to continue blogging. Your opinion much more valuable to me. Thank you.