తెలుగు విద్యార్థులను టెర్రరిస్టుల్లా చూశారు.

No Comments
హైదరాబాద్‌: అమెరికా ప్రీ క్లియరెన్స్ (ఇమిగ్రేషన్) కోసం దిగిన అబు దుబాయ్ విమానాశ్రయంలో దిగిన భారత విద్యార్థులను దాదాపు 16 గంటల పాటు బంధించారు. వారందరినీ ఓ గదిలో బంధించి సెల్‌ఫోన్లు, డబ్బులు లాక్కున్నారు. తీవ్ర భయాందోళనలకు గురి చేశారు. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన తెలుగు విద్యార్థులు మార్గమధ్యలో అబుదాబీ విమానాశ్రయంలో 16 గంటలపాటు నరకం చూపించారు. ఈ నెల 22వ తేదీన ఇది జరిగింది. ఎట్టకేలకు భారత్‌కు రావడానికి వీసా లభించడంతో 25 మంది తెలుగు విద్యార్థులు గురువారం తెల్లవారుజామున శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. అబుదాబీలో ఇమ్మిగ్రేషన్‌ అధికారులు తమను టెర్రరిస్టుల్లా వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విద్యార్థులు కాలిఫోర్నియాకు చెందిన సిలికాన్ వ్యాలీ యూనివర్శింటి, సాన్ జోస్ అండ్ నార్‌వెస్టర్న్ పాలిటెక్నిక్ విశ్వవిద్యాలయాల అడ్మిషన్ లెటర్లతో పాటు తగిన వీసాలు కూడా పొందారు. 24 గంటల పాటు తాగుతావా, ఎంత తాగుతావు, ఎయిర్ హోస్టెస్ ఏం ధరిస్తుంది వంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలను అమెరికా కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ అధికారులు వేశారు.US officials publicly shame Indian students, lock them up like criminals
 
 డిసెంబర్ నెల 20, 21 తేదీలలో దాదాపు యాభై నుంచి ఆరవై మంది తెలుగు విద్యార్థులు అబుదాబీకి చేరుకున్నారు. అక్కడ ఇమ్మిగ్రేషన్‌ అధికారులు తనిఖీలు చేట్టారు. మీరు ఎక్కడికి వెళ్లాలి? ఎందుకోసం వచ్చారు. మీ దగ్గర ఎంత నగదు ఉంది? అంటూ రకరకాల ప్రశ్నలు సంధించారు. వీటన్నింటికి సమాధానం చెప్పినా, చివరకు ఎఫ్‌వన్‌ వీసా చెల్లదని తిరిగి ఇండియా వెళ్లిపోవాలని చెప్పారు. వీసాలను ఎందుకు రద్దు చేశారనే వివరణ కూడా అమెరికా అధికారులు ఇవ్వలేదు. పైగా, అమెరికా విశ్వవిద్యాలయాల ఆడ్మిషన్ ఆఫర్‌ను తాము ఇష్టప్రకారం వదులుకుంటున్నట్లు రాసి, సంతకాలు చేయించుకున్నారు. ఇదిలావుంటే, భారతీయ విద్యార్థులను విమానాశ్రయంలోనే నిరోధించిస నిర్బంధించి, అత్యంత అవమానకర రీతిలో తిరిగి పంపించి వేసిన ఘటనపై అమెరికా పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై వివరాలు సేకరిస్తున్నామని భారత్‌లోని అమెరికా రాయబారి రిచర్డ్‌ వర్మ తెలిపారు. విద్యార్థులను నిరోధించిన ఘటనను భారత ప్రభుత్వం అమెరికా దృష్టికి తీసుకెళ్లిందని, దీనిపై కారణాలు తెలపాల్సిందిగా కోరినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గల్ఫ్‌ ఎయిర్‌వేస్‌ భరోసా అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అధికారుల నుంచి బహిష్కరణకు గురైన విద్యార్థులకు మళ్లీ ప్రయాణ ఏర్పాట్లు చేసేందుకు గల్ఫ్‌కు చెందిన ఇతెహాద్‌ ఎయిర్‌వేస్‌ ముందుకొచ్చింది. అయితే ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ మాత్రం అమెరికా నుంచి గ్రీన్‌సిగ్నల్‌ వచ్చే వరకు విద్యార్థుల్ని అనుమతించబోమని తెలిపింది.

Dear readers, after reading the Content please ask for advice and to provide constructive feedback Please Write Relevant Comment with Polite Language.Your comments inspired me to continue blogging. Your opinion much more valuable to me. Thank you.