పెళ్ళి సంపద కోసం చేసుకోవాలా ప్రేమ కోసమా

No Comments
పెళ్ళిళ్ళు ఇద్దరు వ్యక్తులమధ్య ఆరాధన, గౌరవాన్ని ప్రెంపొందించే బంధాలు.ఇవి పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు లేదా ప్రేమ పెళ్ళిలవ్వచ్చు.తమకి జీవితాంతం ప్రేమని, ఆప్యాయతని పంచే తోడు కోసం ఇద్దరు వ్యక్తులు పెళ్ళి చేసుకుంటారు.కానీ కొంతమంది మాత్రం పెళ్ళిళ్ళని వాణిజ్య సంబంధ ఆఫర్లుగా భావించి తమకి బాగా లాభదాయకమయిన వారిని విబాహం చేసుకుంటారు.ఇది వినడానికి వింతగా అనిపించినా ఇదే నిజం.చాలా మంది కేవలం డబ్బు కోసమే పెళ్ళి చేసుకుంటారు. వాణిజ్య ఉద్దేశ్యంతో చేసుకున్న పెళ్ళిళ్ళు కూడా సఫలం అవుతాయి.కానీ ప్రేమ కోసమా పెళ్ళి డబ్బు కోసమా అన్నది మాత్రం ఇప్పటికీ శేష ప్రశ్నే.జీవితం లో ప్రేమ చాలా ముఖ్యం కానీ డబ్బు పాత్రనీ తోసిరాజలేము.పెరుగుతున్న డిమాండ్లు,ఆర్ధిక అవసరాల దృష్ట్యా ప్రతి ఒక్కరూ ప్రాక్టికల్ గా ఆలోచించాలి.బ్రతకడానికి ప్రేమ ఒక్కటే సరిపోదు.డబ్బుల్లేక, ఇబ్బందులు చుట్టు ముట్టినప్పుడు ఏ ప్రేమా అక్కరకు రాదు. పెళ్ళిని ప్రేమ కోసం కంటే డబ్బు కోసం చేసుకోవడమే ఉత్తమం అనడానికి చాలా కారణాలు, ఉదాహరణలే ఉన్నాయి.ఈ మధ్య ప్రజలు ప్రాక్టికల్ అయ్యి పెరుగుతున్న డబ్బు ప్రాముఖ్యతకి అనుగుణం గా ఆలోచిస్తున్నారు.ప్రేమ కోసం లేదా సంపద కోసం పెళ్ళి చేసుకునేటప్పుడు ఈ టిప్స్ పాటించండి. rela
 
 1.సెక్యూరిటీ 
పెళ్ళి ప్రేమ కోసం చేసుకున్నా, సంపద కోసం చేసుకున్నా భవిష్యత్తు కి భరోసా/రక్షణ ఉండాలి.ఆర్ధిక పరమైన స్థిరత్వం భరోసా కి పర్యాయపదం.ఎవరైతే ఆర్ధిక పరమైన స్థిరత్వాన్నీ, రక్షణ ని ఇవ్వగలరో వారిని పెళ్ళాడటం ఒక మంచి రిలేషన్ షిప్ టిప్.భవిష్యత్తు గురించి ఏదో ఒక రకమైన భరోసా ఉండాలి.మీరు కేవలం డబ్బు కోసం అవతలి వారిని ప్రేమించక్కర్లేదు, కనీసం పెళ్ళి తరువాత మీ భవిష్యత్తు కి రక్షణా ,భరోసా చూడండి. 
 
 2.సౌకర్యం 
 సౌకర్యం అంటే జీవితం లో అన్ని లగ్జరీలూ ఉండటం కాదు. పెళ్ళి తరువాత కనీస అవసరాలకి సరిపడా డబ్బు ఉండాలి.కేవలం ప్రేమ చూసి పెళ్ళి చేసుకుంటే ఆ ప్రేమ సౌకర్యాన్నివ్వదు.మీరు మీకు నచ్చిన వారిని పెళ్ళి చేసుకున్నా, వారు కనీసం మీ నిత్య జీవిత అవసరాలని తీర్చగలిగేవారయ్యి ఉండాలి. 
 
 3.సంతృప్
తి ఒక బంధం నిలబడాలంటే ప్రేమ చాలా ముఖ్యం. దీనిలో సందేహం లేదు.కానీ ఒక కుటుంబం మనుగడ సాగించడానికి డబ్బు మరియు సంపద కూడా ముఖ్యమే.కుటుంబం సంతృప్తి కరమైన జీవనం గడపాలంటే డబ్బు చాలా ముఖ్యం.ప్రతీ స్త్రీ తన అవసరాలు తీరి తన కుటుంబం అంతా మంచి జీవితాన్ని గడపాలని కోరుకుంటుంది.అలాగే ప్రతీ మగవాడూ తన కుటుంబాన్ని చూసుకుంటూ తన అవసరాలు తీర్చే స్త్రీ కావాలనుకుంటాడు.ప్రేమ ఆధారితమైనా సంపద ఆధారితమైనా ఇద్దరికీ సౌకర్యవంతమైన జీవితం కావాలి.ప్రేమ కోసం కంటే సంపద కోసం పెళ్ళి చేసుకోవడమే ఎక్కువ సంతృప్తికరం అని నిరూపించబడింది.
 
 4.కుటుంబ బంధాలు 
పురాతన కాలం నుండీ ఉన్న పెద్దలు కుదిర్చిన వివాహాలు సాధారణం గా సంపద ఆధారితమే ఉంటాయి.తమ పిల్లలకి తగిన సంబంధం వెతికేటప్పుడు తమకి కులం లో,ఆస్థి అంతస్థులో సమానమైన వారి కోసమే చూస్తారు.సంపద కోసం పెళ్ళి చేసుకోవడం కొత్తేమీ కాదు, మన తల్లితండ్రులు, పూర్వీకులు కూడా చేసిందదే కదా.పెళ్ళి తరువాతే వారి మధ్య ప్రేమ పుట్టింది.తమ అంతస్థు, తాహతు కి తగ్గ వారిని ఎన్నుకోవడమే పెద్దలు కుదిర్చిన వివాహాల వెనుక ఆంతర్యం.కేవలం ప్రేమ కోసమే చేసుకునే పెళ్ళిళ్ళు ఒక్కోసారి సంఘం యొక్క నిబంధనలని కూడా తెంచుతాయి.
 5.దీర్ఘకాల మన్నిక 
ఇది వింతగా అనిపించినా నిజం-డబ్బు లేదా సంపద కోసం చేసుకునే వివాహాలే ఎక్కువ కాలం నిలుస్తాయి ప్రేమ కోసం చేసుకునే వివాహాలకంటే.ఎందుకంటే కొంత కాలానికి ఈ ప్రేమ, ఆకర్షణ కరిగిపోతాయి.రోజువారీ సమస్యలూ,కుటుంబ అవసరాలు,పని ఒత్తిడి వీటన్నింటితో ప్రేమ కోసమే చేసుకున్న పెళ్ళిళ్ళలో వాద ప్రతివాదనలూ, కొట్లాటలూ తలెత్తుతాయి. సంపద కోసమే చేసుకునే పెళ్ళిళ్ళలో కూడా ఇవి తలెత్తుతాయి కానీ సైకిల్ మీద కూర్చుని ఏడవటం కంటే బీ ఎం డబ్ల్యూ కార్ లో కూర్చుని ఏడవటం నయం కదా.

Dear readers, after reading the Content please ask for advice and to provide constructive feedback Please Write Relevant Comment with Polite Language.Your comments inspired me to continue blogging. Your opinion much more valuable to me. Thank you.