అమెరికా వచ్చే విద్యార్థులకు ‘తానా’ ముఖ్య సూచనలు.

No Comments
న్యూయార్క్/హైదరాబాద్: అమెరికాలో విద్యనభ్యసించేందుకు వచ్చే విద్యార్థులందరూ అన్ని విధాలుగా సిద్ధమైన తర్వాతే రావాలని ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) విజ్ఞప్తి చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కొందరు విద్యార్థుల వీసాలను ఇటీవల అమెరికా రద్దు చేసిన నేపథ్యంలో తానా విద్యార్థులకు పలు సూచనలు చేసింది. విద్యార్థులకు ఎదురైన సమస్యను పరిష్కరించేందుకు తానా ప్రతినిధులు.. ఆ విద్యార్థులు, వారి కుటుంబసభ్యులు, విశ్వవిద్యాలయాలు, ఎయిర్‌లైన్స్, ఇమ్మిగ్రేషన్ కన్సల్టెంట్స్, ఇండియన్ ఎంబసీ, విదేశీ వ్యవహారాల శాఖ, యూఎస్ సిటిజన్‌షిప్, ఇమ్మిగ్రేషన్ సేవల విభాగం అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఎఫ్-1 వీసాపై వచ్చే విద్యార్థులందరి వివరాలను విమానాశ్రయాల్లో సుదీర్ఘంగా, సమగ్రంగా విచారణ చేయడం జరుగుతుంది. యూఎస్ ఇమ్మిగ్రేషన్ అధికారులు అక్కడి ప్రమాణాలకు అనుగుణంగా వీసా వివరాలుంటేనే విద్యార్థులను అనుమతించడం జరుగుతుంది. కాగా, ఇటీవల కొందరు విద్యార్థులను విమానాశ్రయంలోనే నిలిపేశారు. వీసా ఉన్నవారు సమగ్రమైన వివరాలతో వస్తేనే ఇక్కడ యూఎస్ బోర్డర్స్, కస్టమ్స్ అధికారులు సమగ్రంగా దర్యాప్తు జరిపి అనుమతిస్తారు. ఏ మాత్రం అనుమానం వచ్చినా, పొరబాటులున్నా వారు వీసాలను తిరస్కరిస్తారు. కాబట్టి, విద్యార్థులు సమగ్రమైన సమాచారంతోనే ఇక్కడకు రావాల్సి ఉంటుంది. అమెరికాలో విద్యనభ్యసించేందుకు వచ్చిన విద్యార్థులు తమ భవిష్యత్ ప్రణాళికను సమగ్రంగా అధికారులకు వివరించాల్సి ఉంటుంది. అలా చేయని పక్షంలోనూ అధికారులు వీసాను నిరాకరించే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరమైన వనరులకు సంబంధించిన వివరాలను కూడా తెలియజేయాలి. అయితే, విద్యనభ్యసించేందుకు ఇక్కడికి వచ్చే విద్యార్థులు పార్ట్ టైం జాబ్ చేసుకునేందుకు ఇక్కడి చట్టాల ప్రకారం అనుమతి ఉండదు. సామాజిక భద్రతా నెంబర్లలో ఇచ్చిన ప్రశ్నలకు పలువురు విద్యార్థులు వారి ఉద్దేశాలను వివరించారు. అయితే, అభ్యర్థులు పూర్తి చేసిన డాక్యుమెంట్లు అనుమానాస్పదంగా, మోసపూరితంగా ఉంటే అక్కడి అధికారులు వాటిని ధృవీకరించరు. విదేశాల్లో చదువు అంటే చాలా విద్యార్థుల్లో, వారి కుటుంబసభ్యుల్లో కొంత ఆందోళన ఉంటుంది. అయితే, సమగ్రమైన వివరాలు, పూర్తి సమాచారం ఉన్న విద్యార్థులు అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అలాంటి విద్యార్థులు అమెరికా చట్టాలకు అనుగుణంగా స్వేచ్ఛగా వారి విద్యను కొనసాగించవచ్చు. అందుకే అమెరికాలో విద్యపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పూర్తి వివరాలను తెలుసుకుని ముందడుగు వేయాలి. TANA Urges Telugu Students Coming to USA to be Well Prepared స్టూడెంట్ వీసాలు చదువుకోవడానికి మాత్రమే జారీ చేస్తారు. వీటితో అమెరికాలో పార్ట్‌టైం జాబ్ చేసే అవకాశం, అనుమతి ఉండదు. అయితే, ఎఫ్-1 వీసాపై వచ్చిన విద్యార్థులు పరిమితులకు లోబడి విద్యాసంస్థలో పని చేసుకోవచ్చు. దానిపైనా పర్యవేక్షణ ఉంటుంది. ఏవైనా చట్ట ఉల్లంఘనలకు పాల్పడితే మాత్రం వీసాను రద్దు చేసి, తిరిగి స్వదేశం పంపించడం జరుగుతుంది. విద్యార్థి చదువుకునే సంస్థలో అతనికి మంచి పేరు ఉండాలి. స్ట్రిక్ట్ అటెండెన్స్ నిబంధనలేమీ లేవు. అలా అని అతిగా గైర్హాజరును అనుమతించరు. ఇందుకోసం ఎలాంటి కన్సల్టెన్సీలను సంప్రదించాల్సిన అవసరం లేదు. విద్యా సంస్థల నుంచి ఫీజులు తీసుకుని అవి పని చేస్తుంటాయి. విద్యార్థులందరూ సరైన డాక్యుమెంట్లతో రావాల్సి ఉంటుంది. ఎలాంటి కోర్సు, ఏ విద్యా సంస్థలో చదువాలనుకుంటున్నారు, ఆర్థిక వనరులు అనే తదితర భవిష్యత్ ప్రణాళికలను విచారణ అధికారుల ముందు విద్యార్థులు పూర్తి విశ్వాసంతో తెలియజేయాలి. ఇమ్మిగ్రేషన్ అధికారులతో మాట్లాడుతున్నప్పుడు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారు కూడా ప్రొఫెషనల్స్ కాబట్టి సరైన తీరులోనే వ్యవహరిస్తారు. ఇమ్మిగ్రేషన్ అధికారుల ముందు ఎలాంటి అసత్యమైన వ్యాఖ్యలు చేయకూడదు. అమెరికాలో విద్యను అభ్యసించేందుకు అనుమతి రావాలంటే సుదీర్ఘమైన తనిఖీకి సిద్ధంగా ఉండాలి. అనుకోని పరిణామాలకు కావాల్సిన ఆర్థిక వనరులు(నగదు) అందుబాటులో ఉంచుకోవాల్సి ఉంటుంది. తనిఖీల సమయంలో ఏ విద్యార్థి అయినా అవమానకరమైన అనుభవం ఎదుర్కొంటే వెంటనే తానాకు సంబంధించిన ఈ మెయిల్ info@tana.org సంప్రదించవచ్చు.  TANA Urges Telugu Students Coming to USA to be Well Prepared
 
 
అమెరికాకు కొత్తగా వచ్చే విద్యార్థులు గానీ, వారి కుటుంబసభ్యులు గానీ, సందర్శకులు గానీ అవసరమైన సూచనలో కోసం http://www.tana.org/help-line-team-square/safety-guidelines తానాను సంప్రదించవచ్చు. తెలుగు విద్యార్థులు అమెరికాలో ఉన్నత చదువులు చదవడానికి వస్తున్నరాంటే తమకెంతో ఆనందంగా ఉంటుందని తానా పేర్కొంది. తమకు సంబంధించిన పూర్తి వివరాలను, అవసరమైన సమాచారాన్ని, అర్హతకు సంబంధించిన వివరాలను సరిచూసుకుని అమెరికాకు వస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ విద్యను కొనసాగించవచ్చు. అమెరికాకు వచ్చే విద్యార్థులు, వారి కుటుంబాలకు అభినందనలు తెలియజేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు తానా అధ్యక్షుడు వి చౌదరి జంపాల.

Dear readers, after reading the Content please ask for advice and to provide constructive feedback Please Write Relevant Comment with Polite Language.Your comments inspired me to continue blogging. Your opinion much more valuable to me. Thank you.