‘బెంగాల్ టైగర్’ కథ:

No Comments

గోదావరి జిల్లాలోని ఆత్రేయపురంలో ఆకాష్ నారాయణ్ (రవితేజ).జీవితాన్ని హ్యాపీగా, ఎలాంటి సాధకబాధలు లేకుండా ఉంటాడు. అల్లరి చిల్లరిగా తిరుగుతున్న ఆకాష్ కు పెళ్లి చేయడానికి అక్షతో పెళ్లి చూపుల్ని అరేంజ్ చేస్తారు ఆకాష్ కుటుంబ సభ్యులు. తనని పెళ్లి చేసుకునేవాడు ఫేమస్ అయినా కావాలి లేదో ఏదో ఒకటి చేసి మీడియా దృష్టిలో పడాలి అని ఆ పెళ్ళికి అక్ష నో అని చెబుతుంది. తమ ఊరికి ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం వచ్చిన మినిష్టర్ (షియాజీ షిండే) కారు అద్దాన్ని పగలగొడతాడు ఆకాష్. దీంతో ఆకాష్ ను జైల్లో వేస్తాడు మినిష్టర్. ఆకాష్ గట్స్, తెలివితేటలు నచ్చి తన కూతురు శ్రద్ధ (రాశిఖన్నా) కు ప్రాణాపాయం ఉందని హోమ్ మినిష్టర్ (రావు రమేష్) ఆకాష్ ను, శ్రద్ద బాడీగార్డ్ లా తన వద్ద చేర్చుకుంటాడు. ప్రత్యర్థుల నుండి తనను రక్షించడంతో ఆకాష్ ను ప్రేమిస్తుంది శ్రద్ధ. ఆకాష్, శ్రద్ధ లకు పెళ్లి చేయడానికి అన్ని అరేంజ్ మెంట్స్ చేస్తాడు హొమ్ మినిష్టర్.పెళ్లి అనౌన్స్ చేశాక, ఈ పెళ్లి చేసుకోనని ముఖ్యమంత్రి అశోక్ గజపతి (బొమన్ ఇరానీ)కూతురు మీరా (తమన్నా)ను ప్రేమిస్తున్నానని ట్విస్ట్ ఇస్తాడు ఆకాష్. ఆ పార్టీ కి అటెండ్ అయిన అశోక్ గజపతి తన కూతురు నుండి ఆకాష్ ను దూరం చేయడానికి డబ్బు ఆశ చూపుతాడు. ముఖ్యమంత్రికి,ఆకాష్ కు ఉన్న గొడవలేంటి? నిజంగానే మీరాను ఆకాష్ ప్రేమించాడ? అనేది మిగతా స్టొరీ.

విశ్లేషణ:
రవితేజ అనగానే ఫస్ట్ గుర్తుకు వచ్చేది ఎంటర్ టైనర్ సినిమాలు, యాక్షన్, టైమింగ్ కామెడీ. బెంగాల్ టైగర్ మాస్ పెర్ఫామెన్స్ క్యారెక్టర్ లో రవితేజ ఇరగదీశాడు. యాక్టివ్ గా స్క్రీన్ పై కనిపిస్తూ కామెడీ పంచ్ అలరించాడు. కిక్ సినిమా టైంలో బాగా సన్నబడిన రవితేజ,ఇందులో లుక్,స్టైలిష్ క్యాస్టుమ్స్ పై కేరింగ్ తీసుకున్నాడు. మీరా పాత్రలో నటించిన తమన్నా ఎప్పటిలాగే అలరించినా, తన గ్లామర్ తో హీటెక్కించింది. పొగరున్న క్యారెక్టర్ లో నటించిన రాశిఖన్నా తమన్నాకు ఏమాత్రం తీసిపోకుండా బికినీలో కనిపించి, అందాల ఆరబోతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.,మెయిన్ విలన్ గా బొమన్ ఇరానీ సీఎం గా నెగటివ్ పాత్రలో ఆకట్టుకున్నాడు. కమెడియన్స్ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ, రవితేజ కాంబినేషన్ లో వచ్చే కామెడి సీన్స్ బాగా పేలాయి. నాగినీడు,షియాజీ షిండే, రావు రమేష్ పాత్రల పరిధి మేరకు నటించారు.

ఇక టెక్నికల్ విషయానికొస్తే సంపత్ నంది రాసుకున్న కథ,కథనాలు రొటీన్ అయినా ఫస్ట్ హాఫ్ ను డీల్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఫస్ట్ హాఫ్ పూర్తిగా ఆడియెన్స్ ని ఎంటర్ టైన్ చేస్తుంది. సెకండాఫ్ లో ట్విస్ట్ బాగున్నా,స్లో నేరేషన్ గా సాగుతుంది. అయితే సంపత్ నంది రాసుకున్న డైలాగులు మాస్ ఆడియెన్స్ చే విజిల్స్ వేయిస్తాయి.యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ అందించిన పాటలు వినడానికి సోసో గా ఉన్నా, విజువల్ గా బాగున్నాయి. చిన్నా అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలెట్ గా చెప్పొచ్చు. సౌందర్ రాజన్ ఫోటోగ్రఫీ కలర్ఫుల్ గా ఉంది. అయితే ఎడిటింగ్ విషయంలో దర్శకుడు కొంచెం దృష్టి పెట్టి ఉంటే సెకండాఫ్ మరింత బాగుండేది. చిన్న బడ్జెట్ సినిమాలు నిర్మిస్తున్న నిర్మాత రాధామోహన్ ఈ సినిమా కోసం నిర్మాణ విలువలు, సినిమా పబ్లిసిటీ విషయంలో ఎక్కడా రాజీపడలేదు.

ఓవరాల్ గా రవితేజ స్టైల్ లో మాస్ ఎంటర్ టైనర్ సినిమాగా బెంగాల్ టైగర్ అలరిస్తుంది.

బలం:
రవితేజ
తమన్నా,రాశిఖన్నా గ్లామర్ షో
30 ఇయర్స్ పృథ్వీ
సినిమాటోగ్రఫీ

బలహీనతలు:
రొటీన్ స్క్రీన్ ప్లే
మ్యూజిక్
సెకండాఫ్
తీర్పు: ఫస్ట్ హాఫ్ టైగర్… సెకండాఫ్ రూట్ మార్చి.. మాస్ ఎంటర్ టైనర్ గా నిలిచాడు

Dear readers, after reading the Content please ask for advice and to provide constructive feedback Please Write Relevant Comment with Polite Language.Your comments inspired me to continue blogging. Your opinion much more valuable to me. Thank you.