బాలకృష్ణ కంటే పెద్ద నటుడు, 'జబర్దస్త్'ను ఓర్వలేకే: తప్పించడంపై రోజా.

No Comments
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన వైసిపి ఎమ్మెల్యే రోజా సోమవారం మండిపడ్డారు. ఆమె ఓ టీవీ ఛానల్లో మాట్లాడారు. ఎన్టీఆర్, బాలకృష్ణ, నేను కూడా వారి (టిడిపి) యాక్టింగ్ కింద పనికిరామని ఎద్దేవా చేశారు. తాను ఎవరినో తిడుతూ రాజకీయంగా ఎదగలేదన్నారు. నేను కిందిస్థాయి నుంచి పని చేసి ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పారు. తనకు డ్రామాలు రావని, రాజకీయ వ్యూహాలు తెలియవన్నారు. తనకు వైసిపిలో రెండు మూడు స్థానాలలో ఉండాలనే లక్ష్యాలు ఏమీ లేవన్నారు. ఫైర్ బ్రాండ్ ముద్ర తాను తెచ్చుకున్నది కాదన్నారు. తాను ఎప్పుడూ మహిళలను కించపర్చే మాటలు మాట్లాడలేదని, అలాగే, తిట్టాలని జగన్ ఎప్పుడూ తనకు సూచించలేదన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే తనలాంటి వాళ్లు అసెంబ్లీలో అడుగుపెట్టకుండా చేస్తున్నారని టిడిపిపై మండిపడ్డారు.TDP leaders are big actors: Roja
 
 త్వరలో ప్రజల్లోకి వెళ్తానని చెప్పారు. ప్రజలకు ఎవరు ఏమిటో అర్థమవుతోందన్నారు. అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోనని చెప్పారు. తాను ఓ మహిళ అని చూడకుండా టిడిపి నేతలు బూతులు తిడుతున్నారన్నారు. కాల్ మనీ - సెక్స్ రాకెట్‌ను వడ్డీ వ్యాపారంతో ముడేసి తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేశారన్నారు. సభాపతిని అధికార పక్షం తమకు అనుకూలంగా వాడుకుంటోందని ఆరోపించారు. తన కుటుంబం రాజకీయాల నుంచి తనను బయటకు రమ్మని చెబుతోందన్నారు. తన ఆరోగ్యం బాగుకాగానే చంద్రబాబు అంటే ఏమిటో ప్రజలకు చెబుతానన్నారు. తాను గతంలో రెండు నెలల పాటు జబర్దస్త్‌లో చేయలేదని, అప్పుడు నాగబాబు సహా అందరూ తాను రావాలని కోరుకున్నారన్నారు. తన నవ్వూ బాగుంటుందని ప్రజలు కూడా చెబుతున్నారన్నారు. మొన్న ఓసారి పని నిమిత్తం ఢిల్లీ వెళ్లానని, అప్పుడు మంచు లక్ష్మీ జబర్దస్త్‌లో కనిపించారన్నారు. దీంతో, తనను జరబ్దస్త్ నుంచి తప్పించినట్లు ఊహాగానాలు వినిపించాయని చెప్పారు. జబర్దస్త్ నుంచి తనను తప్పించాలని తెలుగుదేశం పార్టీ వాళ్లు ఒత్తిడి కూడా చేసి ఉండవచ్చునని, కానీ అది జరగలేదని అభిప్రాయపడ్డారు. జరబ్దస్త్ ద్వారా తనకు వచ్చే ప్రతిష్టను టిడిపి నేతలు ఓర్వలేకపోతున్నారన్నారు.

Dear readers, after reading the Content please ask for advice and to provide constructive feedback Please Write Relevant Comment with Polite Language.Your comments inspired me to continue blogging. Your opinion much more valuable to me. Thank you.