ఏలూరు/ విజయవాడ: పశ్చిమ గోదావరి జిల్లా కుకునూర్ మండలం కూనవరంలొద్ది
గ్రామంలో ఓ యువతిపై ఆటోడ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన శనివారం
వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన వివరాలను ఎస్‌హెచ్‌సీ రెహ్మాన్ వివరించారు.
ఆ వివరాలు ఇలా ఉన్నాయి - ఓ యువతి తన తల్లిదండ్రులతో కలిసి శుక్రవారం రాత్రి
ఖమ్మం జిల్లా బూర్గంపాడు నుంచి స్వగ్రామమైన ఇసుకపాడుకు వెళ్లడానికి ఆటో
ఎక్కింది. వారితోపాటు ఎక్కిన మరో ఇద్దరు వ్యక్తులు కుకునూర్‌లో దిగిపోయారు.
తర్వాత గ్రామమైన ఇసుకపాడులో యువతి తల్లిదండ్రులు ఆటో దిగారు.
యువతి ఆటో దిగేలోపే డ్రైవర్ ఆటోను వేగంగా లంకాలపల్లి గ్రామ సమీపంలోని
అడవికి తీసుకెళ్లాడు. అనంతరం తల్లిదండ్రులు యువతి కోసం వెతికినా
కనిపించలేదు. శనివారం ఉదయం బాధితురాలు తనపై ఆటో డ్రైవర్ ఆత్యాచారానికి
పాల్పడ్డాడని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి
దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
ఇదిలావుంటే, కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం శివారులోని కేరళ హోటల్ సమీపంలో ఆగి
ఉన్న టిప్పర్‌ను బైక్ ఢీకొట్టడంతో ఇద్దరు మరణించగా, మరొకతను తీవ్రంగా
గాయపడ్డాడు. శనివారంనాడు ఈ ఘటన చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నం మండలం
పెదలంకకు చెందిన ముగ్గురు యువకులు బైక్‌పై ఇబ్రహీంపట్నం వెళ్తున్న సమయంలో
రోడ్డు పక్కన ఉన్న టిప్పర్‌ను ఢీకొట్టారు.
దాంతో బైక్ నడుపుతున్న నాగరాజు (28) అక్కడికక్కడే మరణించాడు. ఇద్దరు
తీవ్రంగా గాయపడ్డారు. ఇది గమనించిన స్థానికులు వారిని ఆస్పత్రికి
తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మరణించాడు
Dear readers, after reading the Content please ask for advice and to provide constructive feedback Please Write Relevant Comment with Polite Language.Your comments inspired me to continue blogging. Your opinion much more valuable to me. Thank you.