Showing posts with label నేటి తాజా వార్తలు. Show all posts
Showing posts with label నేటి తాజా వార్తలు. Show all posts
అతీత శక్తుల గుట్టు విప్పే టెక్నాలజీ

అతీత శక్తుల గుట్టు విప్పే టెక్నాలజీ

No Comments
CBS న్యూస్ అనే ప్రముఖ వార్తా సంస్థ 2005లో అమెరికాలో నిర్వహించిన ఓ సర్వే ఆసక్తికర విషయాలను వెలుగులోకి తీసుకువచ్చింది. ఈ సర్వే లో భాగంగా 48 శాతం మంది అమెరికన్లు ఆత్మలను నమ్ముతున్నట్లు వెల్లడయ్యింది. ఇదే అంశానికి సంబంధించి ఇతర సంస్థలు నిర్వహించిన సర్వేల్లోనూ 20 నుంచి 50 శాతం మంది దొయ్యాలను నమ్ముతున్నట్లు తేలింది. ఈ గణాంకాలను విశ్లేషించినట్లయితే దొయ్యాలు, భూతాలను నమ్మే వారి కంటే నమ్మని వారి సంఖ్య ఎక్కువుగా ఉన్నట్లు తెలుస్తుంది.
అయితే చాల మందిలో ఈ ఆత్మల పట్ల ఓ రకమైన కన్ఫ్యూషన్ వాతావరణం నెలకుందని ఈ అధ్యయనాలు వెల్లడించాయి. ఈ రకమైన ఆందోళనతో సతమతమవుతోన్న పలువురు తమ అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు నిపుణులను సైతం రంగంలోకి దింపుతున్నారట. ఈ ఘోస్ట్ హంటర్స్ అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి దొయ్యాలు ఉన్నది, లేనిది నిర్ధారించేస్తారట. అసాధారణ శక్తులకు సంబంధించిన అంతుచిక్కని గుట్టును శోధించేందుకు ఘోస్ట్ హంటర్లు ఉపయోగిస్తున్న టెక్నాలజీని ఇప్పుడు చూద్దాం...
ఈవీపీ పరికరం ఈ ప్రొఫెషనల్ ఈవీపీ పరికరం తాను గ్రహించిన శబ్థాలను ఏకకాలంలో ప్లేబ్యాక్ చేయటంతో పాటు రికార్డ్ చేస్తుంది. అతీత భావన పరిశోధనల్లో ఈ గాడ్జెట్ ను ఎక్కువగా ఉపయోగిస్తారు.
గోస్ట్ హంటింగ్ గేర్ పారానార్మల్ పరిశోధకులైన రోనా అండర్సన్, బెన్ మికాన్‌లు గోస్ట్ హంటింగ్ గేర్ సహాయంతో తమ పరిశోధనలను సాగిస్తున్న దృశ్యం.
ఇన్‌ఫ్రారెడ్ కెమెరా అతీన భావనలను అన్వేషించేందుకు ఉపయోగించే ఇన్‌ఫ్రారెడ్ కెమెరా
డిజిటల్ థర్మామీటర్ అతీత భావనలను అన్వేషించేందుకు ఉపయోగించే డిజిటల్ థర్మామీటర్.
డిజిటల్ ఆడియో రికార్డర్స్ అతీత భావనలను అన్వేషించేందుకు ఉపయోగించే డిజిటల్ ఆడియో రికార్డర్స్.
ఈఎమ్ఎఫ్ మీటర్స్ అతీత భావనలను అన్వేషించేందుకు ఉపయోగించే ఈఎమ్ఎఫ్ మీటర్స్.
ఇన్‌ఫ్రారెడ్ థర్మామీటర్ అతీత భావనలను అన్వేషించేందుకు ఉపయోగించే ఇన్‌ఫ్రారెడ్ థర్మామీటర్.
గోస్ట్ బాక్స్ అతీత భావనలను అన్వేషించేందుకు ఉపయోగించే గోస్ట్ బాక్స్.
కెమెరా ట్రాప్ అతీత భావనలను అన్వేషించేందుకు ఉపయోగించే కెమెరా ట్రాప్.
మోషన్ డిటెక్టర్ అతీత భావనలను అన్వేషించేందుకు ఉపయోగించే మోషన్ డిటెక్టర్.
పారాబోలిక్ మైక్రోఫోన్ అతీత భావనలను అన్వేషించేందుకు ఉపయోగించే పారాబోలిక్ మైక్రోఫోన్.
కెమెరా ఎక్విపిడ్ నైట్ విజన్ స్కోప్ అతీత భావనలను అన్వేషించేందుకు ఉపయోగించే కెమెరా ఎక్విపిడ్ నైట్ విజన్ స్కోప్.
గోస్ట్ హంటింగ్ స్టార్టర్ కిట్ టామ్స్ గాడ్జెట్స్ సంస్థ అందిస్తోన్న గోస్ట్ హంటింగ్ స్టార్టర్ కిట్. ఈ కిట్ లో అతీత భావనలను అన్వేషించేందుకు ఈఎమ్ఎఫ్ మీటర్, బీమ్ బారియర్ అలారమ్ సెట్, ఇన్‌ఫ్రారెడ్ థర్మామీటర్ ఇంకా ఫ్లాష్ లైట్ లు ఉంటాయి.

ఈ ఫోన్‌ని 800 ఏళ్ల క్రితం ఏలియన్స్ వదిలివెళ్లారట

ఈ ఫోన్‌ని 800 ఏళ్ల క్రితం ఏలియన్స్ వదిలివెళ్లారట

1 comment
మనిషి జీవితంలో ఫోన్ అనేది ఎప్పటి నుంచి ప్రారంభమైంది అని ఎవర్నైనా అడిగితే వారు ఏం చెబుతారు. మహా అంటే ఓ 30 ఏళ్ల క్రితమో లేకుంటే 40 ఏళ్ల క్రితమో వచ్చింది అని చెబుతారు. మొట్టమొదటిసారిగా టెలిఫోన్ కనుగొన్నది గ్రాహంబెల్ అని అందరికీ తెలిసిన విషయమే. అదీ కూడా 1876లో ఆయన తొలిసారి కనుగొన్నారు. కాని ఇప్పుడు 800 ఏళ్ల క్రితం ఫోన్ తవ్వకాల్లో బయటకొచ్చింది.వినడానికి చోద్యంగా ఉన్నా ఇది నిజం.మీరే చూడండి.

సెల్ ఫోన్లను 800 ఏళ్ల క్రితమే వినియోగించారంటే ప్రపంచం మొత్తాన్ని గుప్పిట్లోకి తీసుకు వచ్చిన సెల్ ఫోన్లను 800 ఏళ్ల క్రితమే వినియోగించారంటే నమ్మగలరా? ఆర్కియాలజిస్టుల తవ్వకాల్లో బయటపడిన ఆధారాలను చూస్తే, నమ్మక తప్పని పరిస్థితి
ఆస్ట్రియా దేశంలో ఆర్కియాలజిస్టులు ఆస్ట్రియా దేశంలో ఆర్కియాలజిస్టులు మొబైల్ ఫోన్ ఆకారంలో ఉన్న ఒక మట్టి నమూనాను కనుగొన్నారు. దీనిపై సెల్ ఫోన్ మీద నంబర్లలా సుమేరియన్ అక్షరాలు ఉన్నాయి
డయల్, బ్యాక్, మెనూ కీస్ లాంటి ఏర్పాట్లు అంతేకాదు ... డయల్, బ్యాక్, మెనూ కీస్ లాంటి ఏర్పాట్లు కూడా కనిపిస్తున్నాయి. సెల్ ఫోన్ల ప్రారంభదశలో మార్కెట్లోకి వచ్చిన మోడల్ రూపంలో ఈ నమూనా ఉంది.
ఆర్కియాలజిస్టులు కనుగొన్న మట్టి నమూనాపై ఆర్కియాలజిస్టులు కనుగొన్న మట్టి నమూనాపై సుమేరియన్లు అభివృద్ధి చేసిన అక్షరాలు ఉన్నాయి. మెసపుటేమియాలో క్రీస్తూ పూర్వ 3500 నుంచి 3 వేల సంవ్సరాల మధ్య సుమేరియన్లు అభివృద్ధి చేసిన లిపిలో ఈ అక్షరాలు ఉన్నాయి.
మరోవైపు, ఇది ఏలియన్స్ (గ్రహాంతరవాసులు) కి చెందినది మరోవైపు, ఇది ఏలియన్స్ (గ్రహాంతరవాసులు) కి చెందినది అయి ఉండవచ్చని కొందరు చెబుతున్నారు. వారు పోతూ పోతూ జారి పడేసి ఉండవచ్చరి మరి కొంతమంది సిద్ధాంతకర్తలు చెబుతున్నారు
అదీ గాక ఈ మొబైల్ కి ఇప్పటి మొబైల్ ఫోన్స్ కి అతి దగ్గర పోలిక అదీ గాక ఈ మొబైల్ కి ఇప్పటి మొబైల్ ఫోన్స్ (మొదట్లో వచ్చిన నోకియా ఫోన్స్) కి అతి దగ్గర పోలిక కూడా ఉంది. దీనిని కనుగొన్న శాస్త్రవేత్తలు ఇది 13 వ శతాబ్దానికి చెందినది గా గుర్తించారు.
ఆ కీబోర్డ్ మీద ఉన్న అక్షరాలు ఇరాక్, ఇరాన్ బాషకు మొదట్లో వచ్చిన మొబైల్స్ కి అచ్చుగుద్దినట్లు కీబోర్డు ఉండడంతో ఇది ఎక్కడి నుండి వచ్చిందో, ఎవరికి సంబంధించిందో అని పురాతత్వ శాస్త్రవేత్తలు తలలు పట్టుకొంటున్నారు. ఆ కీబోర్డ్ మీద ఉన్న అక్షరాలు ఇరాక్, ఇరాన్ బాషకు సంబంధించినదిగా భావిస్తున్నారు.
బయటపడ్డ శిలాజానికి మన మొబైల్ ఫోన్ కి గల సారూప్యతను గ్రహాంతరవాసుల పరిశోధనా శాస్త్రవేత్త అయిన డానియల్ మునోజ్ బయటపడ్డ శిలాజానికి మన మొబైల్ ఫోన్ కి గల సారూప్యతను తెలిపాడు. ఈ వస్తువులు మనకంటే ముందున్న వ్యక్తులవని ఆయన అభివర్ణించాడు.
ఆస్ట్రియా లోని సాల్జ్ బర్గ్ ప్రాంతంలో ఆస్ట్రియా లోని సాల్జ్ బర్గ్ ప్రాంతంలో ఈ వస్తువు దొరికింది .. ఆ ప్రదేశంలో ప్రస్తుతం మరింతగా తవ్వకాలు జరుగుతున్నాయి. ఇంకా ఏమైనా దొరికే అవకాశం ఉందేమోనని తవ్వకాలు మరింత వేగవంతం చేస్తున్నారు అక్కడ.
ఇది ఎప్పుడు ఎక్కడినుండి వచ్చిందో కానీ ఇది ఎప్పుడు ఎక్కడినుండి వచ్చిందో ఆయన సరిగా చెప్పలేకపోయాడు. ఈ వస్తువు ఏమిటనేది ఇప్పటికీ ఒక మిస్టరీనే అంతేకాకుండా నిజమైన సెల్ ఫోన్ అవునో కాదో ఇంకా తెలియాల్సి ఉంది.

ఈ మట్టి ఆకృతి ఏమిటన్నది ఇప్పటికీ తెలియనప్పటికీ ఈ మట్టి ఆకృతి ఏమిటన్నది ఇప్పటికీ తెలియనప్పటికీ, దీని వెనుక ఆసక్తికర అంశాలు దాగి ఉండవచ్చని, వాటిని కనుగొనే ప్రయత్నం చేస్తున్నామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
వందేమాతరంతో హోరెత్తిన పాక్ వెబ్‌సైట్లు.

వందేమాతరంతో హోరెత్తిన పాక్ వెబ్‌సైట్లు.

No Comments
మీరు విన్నది నిజమే.. వందేమాతరం నినాదాలతో పాకిస్తాన్ వెబ్‌సైట్లు మార్మోగిపోయాయి. మరి ఎవరు ఆ నినాదాలు చేశారు అని మీరు ఆశ్చర్యపోతున్నారా.. ఆ నినాదాలు చేసింది మన ఇండియాలోని హ్యాకర్స్. పాకిస్తాన్ లో ని పలు వెబ్‌సైట్లను ఇండియాలోని కొంతమంది హ్యాకర్స్ హ్యాకింగ్ చేసి అందులో మన ఇండియా జెండాతో కూడిన వందేమాతరం నినాదాలు రాశారు. మరి ఇదంతా ఎందుకు చేశారనేగా మీ డౌటు..మీ డౌటు తీరాలంటే కథనం చదవాల్సిందే.

పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాద దాడి నేపథ్యంలో పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారతీయుల గుండె రగిలిపోతోంది. దేశం కోసం ఆత్మ బలిదానం చేసిన అమరవీరులకు తమకు నచ్చిన రీతిలో నివాళులర్పిస్తున్నారు. ఆ త్యాగధనుల కుటుంబాలకు మద్దతు ప్రకటిస్తున్నారు. ఇటువంటివారిలో హ్యాకర్లు కూడా ఉన్నారు.
పాకిస్తాన్ వెబ్ సైట్లలో శుక్రవారం వందేమాతరం అంటూ పాకిస్తాన్ వెబ్ సైట్లలో శుక్రవారం వందేమాతరం అంటూ నినాదాలు కనిపించాయి. పాకిస్తాన్ లోని పలు ముఖ్యమైన వెబ్ సైట్లను భారతీయ హ్యాకర్లు హ్యాక్ చేశారు.
పాకిస్తాన్ కు చెందిన ముఖ్యమైన 7 వెబ్ సైట్లలోకి పాకిస్తాన్ కు చెందిన ముఖ్యమైన 7 వెబ్ సైట్లలోకి చొరబడ్డారు. అందులో పాకిస్తాన్ బార్ కౌన్సిల్ వెబ్ సైటు, విద్య, టూరిజం వెబ్ సైట్ కూడా ఉన్నాయి. కేరళకు చెందిన హ్యాకర్లు ఇండియన్ బ్లాక్ హ్యాట్స్ పేరుతో వెబ్ సైట్లలోకి చొరబడ్డారు.
ఈ సైట్లు ఓపెన్ చేయగానే ఈ సైట్లు ఓపెన్ చేయగానే పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాదుల దాడిని అడ్డుకుని ప్రాణాలు కోల్పోయిన అమరవీరులను కీర్తిస్తూ నివాళుర్పించినట్లు పొందుపర్చారు. వెబ్ సైట్లలో వందేమాతరం అంటూ నినాదం కూడా పెట్టారు. భారత సైనికులను చూసి యావద్భారతం గర్విస్తోందన్నారు. జై భారత్ మాతాకీ అంటూ వెబ్ సైట్లలో ప్రకటన చేశారు కూడా.
పఠాన్ కోట్ ఉగ్రవాద దాడిలో ప్రాణ త్యాగం చేసిన పఠాన్ కోట్ ఉగ్రవాద దాడిలో ప్రాణ త్యాగం చేసిన లెఫ్టినెంట్ కల్నల్ నిరంజన్ కు నివాళులర్పించారు. ఇండియన్ బ్లాక్ క్యాట్స్ పేరుతో ఈ హ్యాకింగ్ జరిగింది. ఈ హ్యాకింగ్ ను నిరంజన్ కుమార్తె విస్మయ కు అంకితం ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆ వెబ్ సైట్లలో ఉన్న సమాచారం ఏదీ తీసేయలేదని అంతేకాదు .. ఆ వెబ్ సైట్లలో ఉన్న సమాచారం ఏదీ తీసేయలేదని, కేవలం నివాళర్పించామని హ్యాకర్లు ప్రకటించారు. తాము వెబ్సైట్ల నుంచి దేనినీ తొలగించలేదని, లెఫ్టినెంట్ కల్నల్ నిరంజన్ కుమార్తె విస్మయ ఫొటోను మాత్రమే అప్లోడ్ చేశామని వీరిలో ఓ హ్యాకర్ ఓ పత్రికకు తెలిపారు. తమది సైబర్ యుద్ధం కాదని, పాకిస్థాన్ ప్రజలకు సందేశమని స్పష్టం చేశారు.
మన దేశం, మన ప్రజల కోసం విలువైన జీవితాలను ఈ ఫొటో క్రింద ''పఠాన్‌కోట్ దాడిలో ప్రాణాలర్పించిన ధైర్యసాహసాలు నిండిన సైనికుల కుటుంబాలకు ఐబీహెచ్ టీమ్ తరపున గొప్ప గౌరవ వందనం సమర్పిస్తున్నాం. మన దేశం, మన ప్రజల కోసం విలువైన జీవితాలను సమర్పించిన ధైర్యవంతులైన సైనికులకు చిన్న నివాళి.
ఇది కేవలం పాకిస్తాన్ ప్రజలకు భారతీయుల తరఫున పంపించే ఇది కేవలం పాకిస్తాన్ ప్రజలకు భారతీయుల తరఫున పంపించే సందేశమేనని అందులో వారు పేర్కొన్నారు. మేం క్షమిస్తాం. మేం మర్చిపోతాం .. మా నుంచి మరేమీ ఆశించకండి. మిమ్మల్ని చూసి మేం గర్విస్తున్నాం, భారత మాతాకీ జై, వందేమాతరం అని రాశారు.
 
హ్యాకింగ్ జరిగిన వెబ్సైట్లు ... పాకిస్థాన్ గవర్నమెంట్ హోం రీమౌంట్ డిపో మోనా, ఫోటిల్ కిచెన్ అప్లయెన్సెస్, సెంటర్ ఫర్ పాకిస్థాన్ అండ్ గల్ఫ్ స్టడీస్, సీఎస్డీ - పాకిస్థాన్ గవర్నమెంట్ కేరింగ్ స్టోర్, మస్లమ్ సన్స్, పాకిస్థాన్ బార్ కౌన్సిల్, ఎస్ఓఎల్పీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మోడర్న్ లాంగ్వేజెస్.
ఆటోలో ఎత్తుకెళ్లి యువతిపై డ్రైవర్ అత్యాచారం చేశాడు .

ఆటోలో ఎత్తుకెళ్లి యువతిపై డ్రైవర్ అత్యాచారం చేశాడు .

No Comments
ఏలూరు/ విజయవాడ: పశ్చిమ గోదావరి జిల్లా కుకునూర్‌ మండలం కూనవరంలొద్ది గ్రామంలో ఓ యువతిపై ఆటోడ్రైవర్‌ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన వివరాలను ఎస్‌హెచ్‌సీ రెహ్మాన్‌ వివరించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి - ఓ యువతి తన తల్లిదండ్రులతో కలిసి శుక్రవారం రాత్రి ఖమ్మం జిల్లా బూర్గంపాడు నుంచి స్వగ్రామమైన ఇసుకపాడుకు వెళ్లడానికి ఆటో ఎక్కింది. వారితోపాటు ఎక్కిన మరో ఇద్దరు వ్యక్తులు కుకునూర్‌లో దిగిపోయారు. తర్వాత గ్రామమైన ఇసుకపాడులో యువతి తల్లిదండ్రులు ఆటో దిగారు. యువతి ఆటో దిగేలోపే డ్రైవర్‌ ఆటోను వేగంగా లంకాలపల్లి గ్రామ సమీపంలోని అడవికి తీసుకెళ్లాడు. అనంతరం తల్లిదండ్రులు యువతి కోసం వెతికినా కనిపించలేదు. శనివారం ఉదయం బాధితురాలు తనపై ఆటో డ్రైవర్‌ ఆత్యాచారానికి పాల్పడ్డాడని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. Auto driver rapes girl in West Godavari district
 
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి 
 ఇదిలావుంటే, కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం శివారులోని కేరళ హోటల్ సమీపంలో ఆగి ఉన్న టిప్పర్‌ను బైక్ ఢీకొట్టడంతో ఇద్దరు మరణించగా, మరొకతను తీవ్రంగా గాయపడ్డాడు. శనివారంనాడు ఈ ఘటన చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నం మండలం పెదలంకకు చెందిన ముగ్గురు యువకులు బైక్‌పై ఇబ్రహీంపట్నం వెళ్తున్న సమయంలో రోడ్డు పక్కన ఉన్న టిప్పర్‌ను ఢీకొట్టారు. దాంతో బైక్ నడుపుతున్న నాగరాజు (28) అక్కడికక్కడే మరణించాడు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇది గమనించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మరణించాడు
తిక్క పవన్ కళ్యాణ్‌కు కెసిఆర్ చుక్కలు చూపించారు: కవిత, "కెసిఆర్ రాజకీయ ఉగ్రవాది"

తిక్క పవన్ కళ్యాణ్‌కు కెసిఆర్ చుక్కలు చూపించారు: కవిత, "కెసిఆర్ రాజకీయ ఉగ్రవాది"

No Comments
హైదరాబాద్: జనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్‌పై తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్లమెంటు సభ్యురాలు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కూతురు కల్వకుంట్ల కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలప్పుడే గంగిరెద్దుల్లా కొంత మంది వస్తారని ఆమె వ్యాఖ్యానించారు. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జిహెచ్ఎంసి) ఎన్నికల్లో టిడిపి, బిజెపి పవన్ కళ్యాణ్‌ను ప్రచారంలోకి దించుతాయట అంటూ ఆమె పలు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలప్పుడు మేకప్, ఆ తర్వాత పేకప్ అంటూ కవిత వ్యాఖ్యానించారు. తిక్క పవన్ కళ్యాణ్కు కెసిఆర్ ఎప్పుడో చుక్కలు చూపించారని ఆమె శనివారంనాడు వ్యాఖ్యానించారు. ఆంధ్రోళ్లు ఎక్కువగా ఉన్నారని ఆంధ్రోళ్లతో హైదరాబాదులో ప్రచారం చేయిస్తారట అంటూ ఆమె వ్యాఖ్యానించారు. మేకప్ వేసుకుని వచ్చేవారిని < ప్రజలు పట్టించుకునే పరిస్థితిలో లేరని ఆమె అన్నారు. Kalvakuntla kavitha makes comments against Pawan Kalyan 
 
 
కెసిఆర్ రాజకీయ ఉగ్రవాది 
 
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును తెలంగాణ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క రాజకీయ ఉగ్రవాదిగా అభివర్ణించారు. తెలంగాణలో ఇతర పార్టీలు లేకుండా చేయాలనే ఆలోచనతోనే కెసిఆర్ రాజకీయ ఉగ్రవాదానికి తెరలేపుతున్నరాని ఆయన అన్నారు. ఈ పద్ధతి ప్రజాస్వామ్యానికి పెను ముప్పు అని ఆయన అన్నారు. ప్రాజెక్టుల నుంచి వచ్చిన అవినీతి సొమ్ముతో ఇతర పార్టీలకు చెందిన నేతలను కెసిఆర్ కొంటున్నారని ఆయన ఆరోపించారు. జిహెచ్ఎంసి డివిజన్ల రిజర్వేషన్ల ఖరారు శాస్త్రీయంగా జరగలేదని ఆయన అన్నారు. ఏ ప్రాతిపదికను రిజర్వేషన్లు చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రిజర్వేషన్లను తారుమారు చేశారని ఆయన అన్నారు. మొత్తం ఓటర్లలో ఎస్సీ, ఎస్టీ, బిసీ మహిళల శాథం ఎంతో చెప్పాలని, ఏ దమాషా ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ డివిజన్లు పెంచాలని ఆయన కోరారు. కెసిఆర్‌పై ప్రజలు తిరగబడే రోజులు వస్తాయని ఆయన అన్నారు.
కూతుర్ని ప్రేమిస్తున్నాడని యువకుడ్ని ముక్కలుగా నరికాడు

కూతుర్ని ప్రేమిస్తున్నాడని యువకుడ్ని ముక్కలుగా నరికాడు

No Comments
అనంతపురం: తన కూతురిని ప్రేమిస్తున్నాడనే కోపంతో ఓ వ్యక్తి ఓ యువకుడిని హత్య చేసి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. అనంతపురంలో జరిగిన ఈ సంఘఠన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కూతురి ప్రేమ వ్యవహారం నచ్చని తండ్రి ప్రేమించిన యువకుడిని తన తోటకు పిలిపించి, కత్తులతో నరికి ముక్కలు ముక్కలుగా చేసి కాళ్లు, చేతులు, తలను బావిలో పడేసి మొండాన్ని అనంతపురం పట్టంలోని రవి పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న కాలువలో పడేశాడు. కాలువలో మొండాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన బయటకు వచ్చింది. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం ముత్తాల గ్రామానికి చెందిన షబ్బీర్ పాష (21) గొర్రెలు మేపుకుంటూ ఉంటాడు. అదే గ్రామానికి చెందిన యువతిని అతను ప్రేమించాడు. విషయం తెలుసుకున్న తండ్రి చంద్రశేఖర్ రెడ్డి షబ్బీర్‌ను చంపాలని పథకరచన చేశాడు. Youth killed for loving a girl in anathapur district 
 
పథకం ప్రకారం ఈనెల 4వ తేదీ తెల్లవారుజామున గొర్రెలకు మందు వేయాల్సి ఉందని షబ్బీర్‌ను తన తోటకు పిలిపించాడు. అక్కడికి వచ్చిన తర్వాత కత్తితో అతన్ని దారుణంగా హతమార్చాడు. నాలుగు రోజుల నుంచి కుమారుడు కనిపించకపోవడంతో షబ్బీర్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో శనివారం మురికి కాలువలో మొండెం ఉందని సమాచారం అందడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు షబ్బీర్ తల్లిదండ్రులకు విషయం తెలిపారు. శరీరంపై గుర్తుల ఆధారంగా షబ్బీర్‌దిగా గుర్తించారు. కాగా, అదే రోజు నుంచి యువతి, చంద్రశేఖర రెడ్డి కూడా కనిపించడం లేదు. దీంతో అతని భార్యను, కూతురును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఉగ్రదాడి: పఠాన్ కోట్ లో ప్రధాని మోడీ .

ఉగ్రదాడి: పఠాన్ కోట్ లో ప్రధాని మోడీ .

No Comments
పఠాన్ కోట్: పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ అధికారులతో కలిసి ఉగ్రదాడి జరిగిన ప్రాంతాలను పరిశీలించారు. శనివారం ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరిన నరేంద్ర మోడీ పఠాన్ కోట్ ఎయిర్ బేస్ చేరుకున్నారు. ఇటీవల ఎయిర్ బేస్ పై జరిగిన ఉగ్రదాడి ఘటనను ఆర్మీ ఉన్నతాధికారులు నరేంద్ర మోడీకి వివరించారు. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ ను మోడీ క్షుణ్ణంగా పరిశీలించారు. పఠాన్ కోట్ పై దాడికి పాల్పడిన ఆరు మంది ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చిన విషయం తెలిసిందే.  Prime Minister Narendra Modi visits Pathankot Air Base 
ఇదే సందర్బంలో ఏడుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదులు ఎలా చొరబడ్డారనే విషయంపై ప్రధాని నరేంద్ర మోడీ అధికారుల నుంచి వివరాలు సేకరించారు. అనంతరం ఆర్మీ అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి చర్చించారు. ఈ సమావేశంలో ఉగ్రవాదాన్ని ఏలా అంతం చెయ్యాలి అనే విషయంపై ప్రధాని నరేంద్ర మోడీ ఆర్మీ అధికారులతో చర్చించారని తెలిసింది. ప్రధాని పర్యటన సందర్బంగా పఠాన్ కోట్ లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.